MovieGQ

Srikarulu Devathalu Srirasthulanaga

Maya Bazaar (1957) · Track 8 of 21

Song Details

Lyrics

పల్లవి: శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్దిల్లవమ్మా వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా సకల సౌభాగ్యవతి రేవతీదేవి తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను సకల సౌభాగ్యవతి రేవతీదేవి తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను అడుగకే వరములిడు బలరామదేవులే జనకులై కోరిన వరము లీయగను వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నరి శశిరేఖ వర్ధిల్లవమ్మా చరణం: 1 శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి పినతల్లియై నిన్ను గారాము శాయ శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి పినతల్లియై నిన్ను గారాము శాయ అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే పినతండ్రియై సకల రక్షణలు శాయ వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా చరణం: 2 ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి మేనత్తయై నిన్ను ముద్దు శాయగను ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి మేనత్తయై నిన్ను ముద్దు శాయగను పాండవ యువరాజు బాలుడభిమన్యుడే బావయై నీ రతన లోకమై మురియా వర్ధిల్లుమా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All