MovieGQ

Dhayacheyandi Dhayacheyandi Thamantha Varika Lerandi

Maya Bazaar (1957) · Track 14 of 21

Lyrics

పల్లవి: దయచేయండీ దయచేయండీ తమంత వారికలేరండీ! తమంత వారిక లేరండీ! అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు అతి ధీమంతులు మీరండీ తగు కైవారం తగు సత్కారం తగు మాత్రంగా గైకొండి తమంత వారిక తమరండీ తతంగమంతా తమకండి హై హై వైవై కైకై గైగై జియ్యా... చరణం: 1 పెండ్లి కుమారా, రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా పెండ్లి కుమారా, రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా ముల్లోకాలను వెతికి తెచ్చిన అల్లుడవంటే నీవయ్యా ముల్లోకాలను గాలించి తెచ్చిన ల్లుడవంటే నీవయ్యా పల్లకి దిగి రావయ్యా తతంగమంతా నీదయ్య తతంగమంతా నీదయ్య కిరీటాలు! కిరీటాలు! వజ్రాలు కిరీటాలు! ధగ ధగ కిరీటాలు! ధరించినంతనె తలలో మెరయును బలె యోచనలు బ్రహ్మాండముగా బలె యోచనలు బ్రహ్మాండముగా శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివె అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా చరణం: 2 హారాలు మణిహారాలు హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు మణిబంధాలు బుజబంధాలు అందాలకు అనుబంధాలు అందాలకు అనుబంధాలు వింత చీరలు వింత ముసుగులు వింత చీరలు వింత ముసుగులు బ్రహ్మాండాలకు సంబంధాలు అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా చరణం: 3 రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు తొడిగన తోడనె తోధిమి తోధిమి అడుగు వేయగనే తైతక్కతైతక్క తొడిగన తోడనె తోధమి తోధమి అడుగువేయగనే తైతక్క తైతక్క నేలమీదనిక నిలువనీయక కులాసగ మిము నటింపజేసే రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు చరణం: 4 ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ నయగారము నా కళరా వయ్యారము నా వలరా నయగారము నా కళరా వయ్యారము నా వలరా హోయ్ నేనే నీ జోడురా నేనే నీ ఈడురా వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ చరణం: 5 సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా హోయ్ నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All