MovieGQ

Choopulu Kalisina Subavela

Maya Bazaar (1957) · Track 1 of 21

Song Details

Lyrics

పల్లవి: చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనునులే చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము ఏకాంతంలో ఆనందించిన నా కలలే నిజమాయెనులే చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము చరణం: 1 ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... చెలువములన్నీ చిత్రరచనలే... చెలువములన్నీ చిత్రరచనలే... చలనములోహో నాట్యములే చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము చరణం: 2 శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే... శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే... శరము ఉద్యానమున వీర విహారమే... శరము ఉద్యానమున వీర విహారమే... చెలి కడనోహో శౌర్యములే... చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maya Bazaar

See All