MovieGQ

Thapamu Phalinchina Subhavela Bedaraganela Priyurala

Sri Krishnarjuna Yuddham (1963) · Track 10 of 22

Lyrics

తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేల జవరాలా తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలిముసుగులో దాగెదవేల మేలిముసుగులో దాగెదవేల వలచి వరించి మనసు హరించి నను చికురించగనేలా తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా చుపులతోనే పలుకరించుతూ చాటున వలపులు చిలకరించుతూ చుపులతోనే పలుకరించుతూ చాటున వలపులు చిలకరించుతూ కోరిక తీరే తరుణము రాగా తీరా ఇపుడీ జాగేలా తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All