MovieGQ

Veyi Subhamulu Kalugu Neeku

Sri Krishnarjuna Yuddham (1963) · Track 12 of 22

Lyrics

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే వాసుదేవుని చెల్లెలా నా ఆశయే ఫలియించెలే వాసుదేవుని చెల్లెలా నా ఆశయే ఫలియించెలే దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెనే వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవులే భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవులే ధీరవీరకుమారునితో మరల వత్తువుగానిలే వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Krishnarjuna Yuddham

See All