Song Details
Lyrics
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఫాలో పదుగురి బాట బోలో నలుగురి మాట లోలో కలవరపాట దాంతో గడవదు పూట ఇటా ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి ఎం ప్రయోజనం సిమెంట్ భూతల సహారెడారిది నిలవడం కుదరదే కదలరా ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఎన్నో పనులను చేస్తాం ఏవో పరుగులు తీస్తాం ఊహూ సతమతమవుతాం ఓహొ బ్రతుకిదే అంటాం అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్ ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
Lyrics sourced from public databases. May contain errors.