Song Details
Lyrics
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పరేషానుగా గడబిడా పడకు అలా మతోయేంతగా శృతే పెంచగా విచారాలా విల విల సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరలా నిను చూడాలంటే అద్దం జడిసేలా ఓ ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరమేస్తామా ఛీ పొమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లేమని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యెయ్యె పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా
Lyrics sourced from public databases. May contain errors.