MovieGQ

Meghaallo

Seethamma Vakitlo Sirimalle Chettu (2013) · Track 7 of 7

Lyrics

మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చుటకు ముచ్చటగ ఇది సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేళ్ల బంధమై అల్లుకుని చేయందుకోవటే ఓ రమణీ ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా ఇంతమందున్నామే అనిపించే బింకం చాటుగా కాస్తయినా కంగారు ఉంటుందిగా నీకయితే సహజం తీయని బరువై సొగసించే బిడియం పనులెన్నో పెట్టి మా తలలు వచ్చిందే ఈ సమయం మగాళ్లమమ్మా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేళ్ల బంధమై అల్లుకుని చేయందుకోవటే ఓ రమణీ రామ చిలుకలతో చెప్పి రాయించామే పత్రిక రాజ హంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏ మాత్రం ఏ చోటా రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చెమర్చేలా గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కనులను విచ్చేలా కలల్లోనైనా కన్నామా కథనైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేళ్ల బంధమై అల్లుకుని చేయందుకోవటే ఓ రమణీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seethamma Vakitlo Sirimalle Chettu

See All