Seethamma Vakitlo Sirimalle Chettu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి అహ సిగ్గంతా చీర కట్టింది
చీరలో చందమామా ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పే తంతెందుకండి
కోదండరామయ్య వస్తున్నాడండీ
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యమొందే వేళిది
మూడు ముళ్లు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా... ఓ...
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా
ఆ మాటా విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీతా గుండె
అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా చుట్టూ చెట్టూ చేమా...ఓ...
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ... ఓ...
- ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
Seethamma Vakitlo Sirimalle Chettu
Movie More SongsSeethamma Vakitlo Sirimalle Chettu Keyword Tags
-
-
-