MovieGQ

Evari Kosam Ee Mandhahasam

Narthanasala (1963) · Track 20 of 22

Song Details

Lyrics

ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును ఆ వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచీ విరహాల రేపు ఆ ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందని సంబరాలే ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే పరుగులు తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు ప్రణయము చిందే సరసాల చందం ఇరువురి నొకటిగ పెనవేయు బంధం ఈ వయ్యారం, ఈ సింగారం ఈ వయ్యారం, ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Narthanasala

See All