MovieGQ

Aalayana Velasina Aa Devuni Reeti

Devatha (1965) · Track 1 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చరణం: 1 పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ కష్టసుఖాలలో తోడూ నీడగా తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావనా ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చరణం: 2 సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగ తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగ సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devatha

See All