MovieGQ

Nallani Vanni

Chatrapathi (2005) · Track 4 of 7

Song Details

Lyrics

నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 1 వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా కడుపులో నిను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 2 తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడుతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chatrapathi

See All