Song Details
Lyrics
గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా ఊది ఊది చరణం: 1 తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి హే పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒకసారి ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే అయిపోనా భామచారి అమ్మమ్మ అబ్బబ్బబ్బా హయ్యయ్యయ్యో అంతా వినక అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక చూపాలయ్యో ఊపు నీది నాకు చెప్పాలయ్యో తీపి సోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది చరణం: 2 నీకు బోలెడు అది ఉంది నాకు బుట్టెడు ఇది ఉంది ఉఁ ఎత్తిపోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది ఇంకింకా ఇంకా ఇంకా కావాలింకా అహా చురక స్త్రీలంక చూడాలింకా నాతోనే కూడింక ఛీపో అనక నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది హాయి తెప్పించనా ఊది ఊది
Lyrics sourced from public databases. May contain errors.