MovieGQ

Sundarangulanu Chusina Velala

Appu Chesi Pappu Koodu (1959) · Track 12 of 20

Lyrics

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా చరణం: 1 అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా కొందరు ముచ్చటపడనేలా చరణం: 2 హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల కొందరు కలవరపడనేల చరణం: 3 యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల కొందరు పరవశ పడనేల చరణం: 4 కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All