Song Details
Lyrics
ఓ మరదలా, నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా! నీరూ పాలూ కలిసి ఒకటైనటులే నీవూ నేనూ ఒకటే గదా! ఓ పంచవన్నెల చిలకా! ...ఆ!? ఆ! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) మాటాడవేమే? మాటాడవేమే, నీ నోటి ముత్యాలొలక! ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) ఓహో బావా, మార్చుకో నీ వంకరటింకర దోవ! ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే ఒప్పుతుందా యీ లోకం? ఓ కొంటె బావగారూ! హాయ్! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2) మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు! ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2) సీమటపాకాయ లాగ చిటాపటాలాడేవు (2) ప్రేముందా లేదా, ఓ మరదలా, నా మీద? ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) మరదలినైతే మాత్రం మరీ అంత చనువా? (2) మరియాద కాదు మీ బావ మరిది చొరవ! ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు! ఓ కొంటె బావగారూ! ఓ పంచవన్నెల చిలకా! (2)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Appu Chesi Pappu Koodu
See AllAppuchesi Pappukudu Thinara
Ghantasala
Joharu gaikonara Deva
P. Leela
Rama Rama Saranam Badradri Rama
P. Leela
Navakala Samithilo (Padyam)
Ghantasala
Moogavaina Yemile Nagumome
A.M. Rajah
Manasu Needhani Nalunaku
Madhavapeddi Satyam, P. Leela, Ghantasala
Chinnari Chupulaku O Chandamama
A.M. Rajah
Anandam Paramanandam
P. Leela, Ghantasala
Kappanu Battina Pamunu (Padyam)
Ghantasala
Kaasiki Poyanu Ramahari
Swarnalatha, Ghantasala
Yechatinundi Veecheno
Ghantasala, P. Leela
Sundarangulanu Chusina Velala
Ghantasala, A.M. Rajah, P. Leela
Neeku Vinipinchane Ledha
P. Susheela
Nee Sukhamunu Nee Bogame
Ghantasala
Thana Dharmambunu Poorthiga
Ghantasala
Kalam Kani Kalamlo
Swarnalatha, P. Leela
Kakulu Pettina Goollanu (Padyam)
Ghantasala
Nee Lopali Naa Lopali Lolopali Guttu Teliya (Padyam)
Ghantasala
Cheyi Cheyi Kaluparave
P. Susheela, A.M. Rajah