MovieGQ

Kaasiki Poyanu Ramahari

Appu Chesi Pappu Koodu (1959) · Track 10 of 20

Lyrics

కాశీకి పోయాను రామా హరీ! గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2) కాశీకి పోలేదు రామా హరీ, ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ! మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ! శ్రీశైలమెళ్ళాను రామా హరీ, శివుని విభూది తెచ్చాను రామా హరీ! (2) శ్రీశైలం పోలేదు రామా హరీ, శివుని విభూది తేలేదు రామా హరీ! ఇది కాష్టంలో బూడిద రామ హరీ! అన్నమక్కరలేదు రామా హరీ, నేను గాలి భోంచేస్తాను రామా హరీ! (2) గాలితో పాటుగా రామ హరీ, వీరు గారెలే తింటారు రామా హరీ! నేతి గారెలే తింటారు రామా హరీ! కైలాసమెళ్ళాను రామా హరీ, శివుని కళ్ళార చూసాను రామా హరీ! రెండు కళ్ళార చూసాను రామా హరీ! కైలాసమెళితేను రామా హరీ, నంది తన్ని పంపించాడు రామా హరీ, బాగ తన్ని పంపించాదు రామా హరీ! ఆలుబిడ్డలు లేరు రామా హరీ, నేను ఆత్మయోగినండి రామా హరీ! గొప్ప ఆత్మయోగినండి రామా హరీ! ఆ మాట నిజమండి రామా హరీ, నేనందుకే వచ్చాను రామా హరీ! నేను అందుకే వచ్చాను రామా హరీ!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All