MovieGQ

Moogavaina Yemile Nagumome

Appu Chesi Pappu Koodu (1959) · Track 5 of 20

Lyrics

మూగవైన యేమిలే, నగుమోమే చాలులే! సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే! మూగవైన యేమిలే! ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే.. దొంగ మనసు దాగదులే..సంగతెల్ల తెలిపెనులే! మూగవైన యేమిలే! పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే.. పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే.. నను దయతో యేలుకొనుము... నను దయతో యేలుకొనుము...కనుసన్నల మెలిగెదలే! మూగవైన యేమిలే! అందాలే బంధాలై నను బందీ చేసెనులే.. అందాలే బంధాలై నను బందీ చేసెనులే.. కలవరమిక యెందుకులే.. కలవరమిక యెందుకులే..వలదన్నా వదలనులే! మూగవైన యేమిలే, నగుమోమే చాలులే! సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే! మూగవైన యేమిలే!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All