MovieGQ

Kalam Kani Kalamlo

Appu Chesi Pappu Koodu (1959) · Track 16 of 20

Lyrics

చిగురుల పూవుల సింగారముతో గనలేదు ముసిముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువు రానేలేదు కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో వలుపులు మీటగ తీయని పాటలు హృదయవీణపై పలికెనుగా, ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా! కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే తళుకుబెళుకుళ తారామణులతో శారదరాత్రులు రాలేదు, ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడు రానేలేదు! కాలం కాని కాలంలో చల్లని వెన్నెల యెందుకనో తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో తలచిన తలపులు ఫలించగలవని బులబాటము బలమాయెనుగా, పగటి కల గను కన్యామణులను ప్రియుడే రాకాచంద్రుడుగా! కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All