Song Details
Lyrics
ఓ...ఓ...ఓ...ఓ... ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట పగిలిన నాగుండెలలో పగిలిన నాగుండెలలో రగులుతున్న రాగం ఈ పాటా... ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట చరణం: 1 పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు చిగురించన మోడులకు నిదురించని గుండెలలో చితిపేర్చిన వల్లకాడు ఈ నాడు కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం ఇక్కడే...కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట చరణం: 2 శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి నెత్తురులో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే ఇది మాతృహృదయమే మృత్యు నిలయమై ఎగసిన విలయ తరంగం మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం అందుకే... పలుకుతుంది శ్లోకం నా శోకం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vetagadu
See AllKonda Meedhi Chandamama
S.P. Balasubrahmanyam, P. Susheela
Bangaru Baathu Guddu
S.P. Balasubrahmanyam, P. Susheela
Aku Chaatu Pinda Thadise
S.P. Balasubrahmanyam, P. Susheela
Puttintollu Tharimesaru
S.P. Balasubrahmanyam, P. Susheela
Jabilitho Cheppana
S.P. Balasubrahmanyam, P. Susheela
Ososi Pilla Kodi Pitta
S.P. Balasubrahmanyam, P. Susheela