Song Details
Lyrics
నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే నీ కోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట చరణం: 1 గుండెల్లో ప్రేమకే... గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో తనువంత పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవితమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట చరణం: 2 ఆకాశం అంచులో... ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యెనులే కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తమా వెన్నెలకురిసే వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే
Lyrics sourced from public databases. May contain errors.