Song Details
Lyrics
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నువ్వే చూడగా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా చరణం: 1 నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే తీయ్యంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంటా విట్టంగా కొత్తంగా ప్రేమను మించే పదమింక మన జంటే కనిపెట్టాలంట వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా చరణం: 2 గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే నేలైన నిను తడితే ఎదలో అసూయ కలిగిందే గారంగా గర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంటా దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు సృష్టించాలటా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
Lyrics sourced from public databases. May contain errors.