Song Details
Lyrics
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం అడుగునౌతాను నీ వెంట నేనూ తోడుగా నడవగా చివరి దాకా గొడుగునౌతాను ఇకపైన నేనూ వానలో నిన్నిలా తడవనీకా నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వు నౌతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలిసిగ్గు నేనవ్వనా ! నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం హా వెన్నెలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా చిరుచెమట పడుతుంటే నీ నుదుటిపైనా వస్తాను చిరుగాలిలా!
Lyrics sourced from public databases. May contain errors.