Song Details
Lyrics
శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ పరుగాపక పయనించవె తలపుల నావా కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా!! పరుగాపక పయనించవె తలపుల నావా కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై, వేకువ నర్తకివై తూరుపు వేదికపై, వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా పరుగాపక పయనించవె తలపుల నావా కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ చలిత చరణ జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హృదయంలో... వికసిత శతదళ శోభల సువర్ణ కమలం పరుగాపక పయనించవె తలపుల నావా కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మో భయావహః!!
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swarna Kamalam
See AllKothaga Rekkalocchina
S.P. Balasubrahmanyam, S. Janaki
Gallu Gallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Andhela Ravali
S.P. Balasubrahmanyam, Vani Jairam
Koluvai Unnade
S.P. Balasubrahmanyam, P. Susheela
Aakasamlo
S. Janaki
Natarajane
S.P. Sailaja
Aathmathvam
S. Janaki
Cheri Yasodaku
S.P. Sailaja
Sakhi Hey
P. Susheela