MovieGQ

Andhela Ravali

Swarna Kamalam (1988) · Track 3 of 10

Lyrics

గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరహా గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం నమో నమో నమశ్శివాయ మంగళప్రదాయ గోతురంగతె నమశ్శివాయ గంగయాతరంగితోత్తమాంగతె నమశ్శివాయ ఓం నమో నమో నమశ్శివాయ శూలినె నమో నమః కపాలినె నమశ్శివాయ పాలినే విరంచితుండ మాలినె నమశ్శివాయ అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా అందెల రవమిది పదములదా... మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేలా జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ అందెల రవమిది పదములదా... నయన తేజమే నకారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై ఈ వాంచితార్ధమె వకారమై యోచన సకలము యకారమై నాధం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమశ్శివాయ భావమె భౌనకు భావ్యము కాదా భరతమె నిరతము భాగ్యము కాదా తుహిల గిరులు కరిగేల తాండవమాడె వేళా ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా ఖగోలాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా అందెల రవమిది పదములదా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Swarna Kamalam

See All