MovieGQ

Gallu Gallu

Swarna Kamalam (1988) · Track 2 of 10

Lyrics

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహ హహ హహహ మలయానిల గతిలో సుమబాలగ తూగాలి ఆహహ ఆహహ వలలో ఒదుగునా విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ తిరిగే కాలానికీ... ఆ...ఆ...ఆ...ఆ... తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటె విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు ఆహ హహ హహహ కమ్మని కలల పాట ఏ రాగం అంటారు? ఉఁ హుఁ హుఁ హుఁ హుఁ అలలకు అందునా ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్దం వద్దని ఆపలేరూ... ఆ...ఆ...ఆ...ఆ... వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే విరి వనముల పరిమళముల విలువేముందీ విలువేముందీ? ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Swarna Kamalam

See All