Song Details
Lyrics
ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వానజల్లై దిగిరానా సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీరే సోయగానా చందమామా మందిరానా నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి ఈ కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swarna Kamalam
See AllKothaga Rekkalocchina
S.P. Balasubrahmanyam, S. Janaki
Gallu Gallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Andhela Ravali
S.P. Balasubrahmanyam, Vani Jairam
Shiva Poojaku
S.P. Balasubrahmanyam, P. Susheela
Koluvai Unnade
S.P. Balasubrahmanyam, P. Susheela
Natarajane
S.P. Sailaja
Aathmathvam
S. Janaki
Cheri Yasodaku
S.P. Sailaja
Sakhi Hey
P. Susheela