Song Details
Lyrics
తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతిని లయను ఒకటి చేసి తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీ కెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల లాలలా లలలా ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి గుండి యలను అందియలుగ చేసి తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా తడబడు అడుగుల తప్పని తరిగిడ థోమ్ తరిగిడ థోమ్ తరిగిడ థోమ్ తడిసిన పెదవుల రేగిన ఆ...ఆ...ఆ... శృతిని లయను ఒకటి చేసి తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకురాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగనాడినదే అలకల కులుకుల అలమేల్మంగా అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగుపాట పల్లవించు పద కవితలు పాడీ ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ... తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన శృతిని లయను ఒకటి చేసి తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల థిల్లానా
Lyrics sourced from public databases. May contain errors.