MovieGQ

Om Namasivaaya

Sagara Sangamam (1983) · Track 3 of 7

Song Details

Lyrics

ఓం ఓం ఓం ఓం నమశివాయ ఓం నమశివాయ చంద్ర కళాధర సహృదయా చంద్ర కళాధర సహృదయా సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా ఓం ఓం నమశివాయ ఓం నమశివాయ పంచ భూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచ భూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడిచిన ఏడు అడుగులే స్వర సప్తతమై నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై తాపస మందారా... నీ మౌనమే దశోపనిశత్తులై ఇల వెలయా ఓం ఓం ఓం నమశివాయ త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋగ్విజవరులై అద్వైతమే నీ ఆది యోగమై నీ లయలే ఈ కాల గమనమై కైలాస గిరివాసా నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ ఓం ఓం ఓం నమశివాయ చంద్ర కళాధర సహృదయా సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sagara Sangamam

See All