MovieGQ

Yedavaku

S.P. Parasuram (1994) · Track 5 of 7

Song Details

Lyrics

ఏడవకేడవకేడవకమ్మా అమ్మకు ప్రాణం నీవేనమ్మా లాలీ జోలా నీకు నేనే నమ్మా ఇవి అమ్మ పాలూ ఇవి గుమ్మ పాలూ ఇవి నలనయ్య కోరే తెల్లనైన పాలూ ఏడవకేడవకేడవకమ్మా అమ్మకు ప్రాణం నీవేనమ్మా కనులు చీకటి చేశాడు కనుకే కనుపాపగా నీకు ఆ దేవుడిచ్చాడురా కనులతో నిను కనలేను గానీ కనురెప్పనై నేను కాపాడుకుంటానురా పదగతో ఆడే పసి మనసూ కొరివినే కొరికే చిరు వయసూ పాపమేదో పుణ్యమేదో ఎరుగనీ మా పాపకీ ఇది అమ్మ లాలీ ఇది నాన్న లాలీ ఇది నిద్దరమ్మ కోరే చల్లనైన లాలీ ఏడవకేడవకేడవకమ్మా అమ్మకు ప్రాణం నీవేనమ్మా లాలీ జోలా నీకు నేనే నమ్మా ఇవి అమ్మ పాలూ ఇవి గుమ్మ పాలూ ఇవి నలనయ్య కోరే తెల్లనైన పాలూ ఏడవకేడవకేడవకమ్మా అమ్మకు ప్రాణం నీవేనమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from S.P. Parasuram

See All