MovieGQ

Yentha Sakkagunnave

Rangasthalam (2018) · Track 1 of 6 · 4:22

Song Details

Lyrics

యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ - ఎంత సక్కగున్నవే ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగ - ఎంత సక్కగున్నవే సుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నవే యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే ఓ రెండు కాళ్ళ సినుకువి నువ్వు గుండె సెర్లో దూకేసినావు అలల మూటలిప్పేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటె ఎంత సక్కగున్నవే సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే తిరనాల్లలో తప్పి ఎడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే గాలి పల్లకీలో ఎంకి పాటలాగ ఎంకి పాటలోన తెలుగు మాటలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిసొత్త వుంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే కట్టెల మోపు తలకెత్తుకోనీ అడుగులోన అడుగేస్తా ఉంటే అదవి నీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే బురద సేలో వరి నాటు ఏత్తావుంటె ఎంత సక్కగున్నవే బూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే యేరుశనగ కోసం మట్టిని తవ్వితె ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangasthalam

See All