MovieGQ

Orayyo

Rangasthalam (2018) · Track 6 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే పాలుపట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కళ్లు పిసికాను ఈ సేతితోనే పాడెమొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలయ్యేనా మా బుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా మమ్ము మేలుకొలిపిన గొంతు గాడ నిదురపోయేనా మా బాధలనోదార్చే తోడుండె వాడివిరా ఈ బాధను ఓదార్చనువ్వుంటే బాగుండెరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే ఎన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా ఈ సేతితోనే మంటల కలపాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా కంచంలోని మెతుకు నిన్నె ఎతికేనయ్యా నీ కళ్లద్దాలు నీకై కలియజుసెనయ్యా నువ్వుతొడిగిన సొక్కా నీకై దిగులుపడి సిలకకొయ్యకురి పెట్టుకుందిరయ్యా రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసెనా వల్లకాట్లో శూన్యం మెదలయ్యేనా నీ నటనకు కన్నింటి సప్పట్లు కురిసెనా నువ్వెళ్ళోత్తానంటూ సెప్పే వుంటావురా మా పాపపు సెవికది యినపడకుంటాదిరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా........

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangasthalam

See All