MovieGQ

Nenu Puttanu Lokam Mechindhi

Prema Nagar (1971) · Track 2 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ (2) నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి (2) నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి (2) తెల్లవారితే వెనకనజేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికె చేతులు వస్తాయి (2) ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది మనిషిని మనిషి కలిసేటందుకె పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకె మధువులు ఉన్నాయి బాధలన్ని బోటిల్లో నేడే దింపేసెయ్ (2) అగ్గిపుల్లా గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసెయ్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Nagar

See All