Song Details
Lyrics
కడవెత్తుకొచ్చింది కన్నె పిల్లా అది కనపడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు చరణం: 1 పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి పిడికిడంత నడుము చుట్టూ పైట కొంగు బిగగట్టి వెళుతుంటే చూడాలి వెళుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎర్రెత్తిపోవాలి దాని ఎనక చరణం: 2 చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మెరిసేటి కళ్ళ డాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు ఆడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు చరణం: 3 తలపాగా బాగ చుట్టి ములుకోలు చేతబట్టి అరకదిమి పట్టుకుని మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు చరణం: 4 నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వొంగింది చిన్నది ఒంపులన్ని వున్నది చూస్తుంటే చాలు దాని సోకు మాడ పడి చస్తాను వస్తానంటే కాళ్ళ కాడ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Prema Nagar
See AllAnthamuleni Ee Bhuvanamantha (Padyam)
Ghantasala
Nenu Puttanu Lokam Mechindhi
Ghantasala
Unte Ee Voollo Undu Pote Mee Desam Pora
P. Susheela
Le Le Le Naa Raja Le Le Naa Raja
L.R. Eswari, Ghantasala
Evaro Ravali Nee Hrudayam Kadilinchali
P. Susheela
Kalavani Deenulapalita Kalavani (Padyam)
P. Susheela
Theta Theta Telugula Tellavari Velugula
Ghantasala
Nee Kosam Velisindi Prema Mandiram
P. Susheela, Ghantasala
Manasu Gathi Inthe Manishi Bratukinte
Ghantasala
Evari Kosam Evari Kosam Ee Prema Mandiram
Ghantasala