MovieGQ

Paadutha Teeyaga Sallaga

Mooga Manasulu (1964) · Track 4 of 9

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసెపుడో కలసిపోతది మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసెపుడో కలసిపోతది చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది జనమ జనమకది మరీ గట్టిపడతది పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mooga Manasulu

See All