Song Details
Lyrics
నా పాట నీ నోట పలకాల సిలకా నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లొలకాల సిలకా నా పాట నీ నోట పలకాల సిలకా పలకాల సిలక... పలకాల చిలకా... ఎహే... చి కాదు... సి సి... సిలకా పలకాల సిలకా... ఆ నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా చరణం: 1 పాట నువ్వు పాడాల పడవ నే నడపాల పాట నువ్వు పాడాల పడవ నే నడపాల నీటిలో నేను నీ నీడనే సూడాల నీటిలో నేను నీ నీడనే సూడాల నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక చరణం: 2 కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల నీ పైట నా పడవ తెరసాప కావాల ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓ నీ పైట నా పడవ తెరసాప కావాల నీ సూపే సుక్కానిగ దారి సూపాల నీ సూపే సుక్కానిగ దారి సూపాల నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక చరణం: 3 మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mooga Manasulu
See AllEe Naati Ee Bandamenatidho 1
P. Susheela, Ghantasala
Godari Gattundhi
P. Susheela
Makunu Kanu Rayirappanu Kanekanu
P. Susheela
Paadutha Teeyaga Sallaga
Ghantasala
Gowramma Nee Mogudevaramma
P. Susheela, Ghantasala
Ee Naati Ee Bandamenatidho 2
P. Susheela, Ghantasala
Muddabanthi Puvvulo Moogakalla Voosulo
Ghantasala
Mukku Meedha Kopam Nee Mukanike Andham
Jamuna Rani