Song Details
Lyrics
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ ఆనకట్టే వేసుకోకూ వద్దనీ కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ దాచేయయకూ ఆపేయకూ అటు వైపు సాగే అడుగునీ ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో
Lyrics sourced from public databases. May contain errors.