MovieGQ

Aakupachhani Chandamaamalaa

Jyo Achyutananda (2016) · Track 1 of 5

Song Details

Lyrics

పల్లవి: ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం ఈరోజే గమ్మత్తుగా గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం దాచెయ్యాలన్నంతగా కేరింతల్లో ఇలా సీతాకోకలా ఎగిరిందిలే మనస్సంతా సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా మనచుట్టే వుంటుందిగా చూస్తేఇలా ఆహాహా బాగున్నదీ ఆహాహా బాగున్నదీ ఈ హాయి బాగున్నది ఈ హాయి బాగున్నది ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం ఈరోజే గమ్మత్తుగా గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం దాచెయ్యాలన్నంతగా చరణం: 1 తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా కలుస్తున్నవే నింగీనేలా ఆహాహా బాగున్నదీ ఆహాహా బాగున్నదీ ఈ హాయి బాగున్నది ఈ హాయి బాగున్నది ఆహాహా బాగున్నదీ చరణం: 2 భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ ఇదేం చిత్రమో ఏమోగానీ ఆహాహా బాగున్నదీ ఆహాహా బాగున్నదీ ఈ హాయి బాగున్నది ఈ హాయి బాగున్నది ఆహాహా బాగున్నదీ ఆహాహా బాగున్నదీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jyo Achyutananda

See All