Song Details
Lyrics
పల్లవి : ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా చరణం: 1 ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా చరణం: 2 అందనంత దూరమేలే నింగికీ నేలకీ వానజల్లే రాయబారం వాటికి మనసుంటె మార్గం ఉండదా ? ప్రతి మనిషి నీకే చెందడా ? ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
Lyrics sourced from public databases. May contain errors.