Song Details
Lyrics
ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా చక్కెర కలిపిన పటాసులా ఆ చిటపట లేంటే బాలా ? విప్పొదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గలా గలా తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న చరణం: 1 హే కథాకళీ చుశానీ నడకల్లో చుశానీ నడకల్లో హే హే నాగావళీ హొయలున్నవె మెలికల్లో ... హొయలున్నవె మెలికల్లో బుసకొట్టకే బంగారీ నస పెట్టకె నాంచారీ తల తిప్పుకు పోకే టపక్కునా ఇక పెట్టకు నన్నే ఇరుక్కునా తెగ బెట్టుచేస్తవే బజారునా చుట్టు జనాలు చూడాలనా ? సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న చరణం: 2 హే అనార్కలీ అరసున్నా నడుముల్లో అరసున్నా నడుముల్లో హే హే దీపావళీ వచ్చిందీ మే-నెల్లో నడిరాతిరి తెల్లారీ పోతున్నా పొలమారీ నువు కాదని అంటే పుసుక్కునా నా ప్రాణం పోదా పుటుక్కునా నా మనసునాపడం అయ్యేపనా ? నువ్వు కారాలు నూరేసినా ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా చక్కెర కలిపిన పటాసులా ఆ చిటపట లేంటే బాలా ? విప్పొదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గలా గలా తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న
Lyrics sourced from public databases. May contain errors.