Song Details
Lyrics
పల్లవి: దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం చరణం: 1 మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం చరణం: 2 పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక నరుడే ఈ నరలోకం నరకం చేశాడు దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం చరణం: 3 తాము నవ్వుతూ నవ్విస్తారు... కొందరు అందరినీ తాము నవ్వుతూ నవ్విస్తారు... కొందరు అందరినీ తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ నేను నవ్వితే ఈ లోకం... చూడలేక ఏడ్చింది నేనేడిస్తే ఈ లోకం... చూసి చూసి నవ్వింది దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం దేవుడనేవాడున్నాడా....
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhagudu Muthalu
See AllDivvi Divvi Divvittam
Pithapuram Nageswara Rao, Swarnalatha
Andhalam Yekkadamma
Ghantasala, P. Susheela
Mella Mella Mellaga
Ghantasala, P. Susheela
Goronka Gootike Cheravu Chilaka
Ghantasala
Goronkakenduko Kondanta Alaka
P. Susheela
Yenkochindoi Mava Yedurochindoi
P. Susheela
Adagaka Ichina Manase
Ghantasala, P. Susheela