MovieGQ

Andhalam Yekkadamma

Dhagudu Muthalu (1964) · Track 2 of 8

Song Details

Lyrics

పల్లవి: అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ చరణం: 1 నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఒడిలోనా ఒదిగినాడమ్మా ఆ ఆ నా ఎదనిండా నిండినాడమ్మా ఆ ఆ ఆ ఆ చరణం: 2 ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ భళ్లునా తెల్లారిపోయెనమ్మా ఆ ఓ ఓ ఓ.. ఒళ్లు ఝళ్లునా చల్లారిపోయెనమ్మా అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా చరణం: 3 వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు నువు లేక కలిమిలేదమ్మా ఆ ఆ నీకన్నా కలిమి ఏదమ్మా అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dhagudu Muthalu

See All