MovieGQ

Vellipotunnava Amma

Dasara Bullodu (1971) · Track 8 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

వెళ్ళిపోతున్నావా... అమ్మా యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా... అమ్మా యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా? నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే... అమ్మా, ఏమై పోవాలి...? నేనెలా బ్రతకాలి...? ||వెళ్ళిపోతున్నావా|| పంపకాలే తలవంపులనీ రెండు యిళ్ళను కలుపుతాననీ పెంపకమిచ్చారానాడు ఆ దత్తే నేడు నా దేవుళ్ళను నడివీధికీ లాగిందమ్మా నవ్వుల పాలు చేసిందమ్మా ||వెళ్ళిపోతున్నావా|| ప్రాణం దేహం విడిపోతున్నవి పాలమనసూ కన్నీరైనది ఎవరో పెట్టిన అనలం రగిలీ యిందరి మమతలు బలికోరినదీ అమ్మా ఏమై పోవాలి నేనింకెలా బ్రతకాలి ఇంకెలా బ్రతకాలి...?

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dasara Bullodu

See All