MovieGQ

O Mallaiahgari Yellayyagari

Dasara Bullodu (1971) · Track 1 of 10

Song Details

Lyrics

ఓ... మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో... ఓ... మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో... గట్టులు కొట్టి పొలం కలుపుకుంటాడు ఒక బుల్లెయ్యా... పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడు ఒక ఎల్లయ్యా... గట్టులు కొట్టి పొలం కలుపుకుంటాడు ఈ బుల్లెయ్యా... పొట్టలు కొట్టి దినం గడుపుకుంటాడు ఒక ఎల్లయ్యా... ఓ... చిన్నవాళ్ల రెక్కల కష్టం యిక్కడ దోస్తాడు... ఓ హో హో హో... ఆ బుల్లయ్యే... పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ యిస్తాడు కోరస్: బుల్లెయ్యా...అక్కడ యిస్తాడు... పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ యిస్తాడు కోరస్: బుల్లెయ్యా...అక్కడ యిస్తాడు... ఓ... మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో... ప్రతి ఒకడూ తినమరిగినవాడూ... ప్రజల పేరే చెబుతూంటాడు వహ... వ... వహ... వ... వారేవా... నిలదీసి... నీ ప్రజలెవరంటే నిన్నూ కాస్త తినమంటాడు దొంగలు దొంగలు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై పోతుంటే వాటా దొరకని వాడు వేరే పార్టీ పెడతాడు... ఓ అసలు పార్టీ నాదీ నాదని వాళ్ళల్లరి పడుతూంటే... గోడమీద పిల్లిలాగ బుల్లెయ్యుంటాడు అహ! కొట్టుకు తింటాడు హేయ్ గోడమీద పిల్లిలాగ బుల్లెయ్యుంటాడు అహ! కొట్టుకు తింటాడు కోరస్: హెయ్... హెయ్...హెయ్ లింగం మింగిన బుల్లెయ్యా గుడిని మింగేదెపుడయ్యా? కోరస్: మింగ్... మింగ్... మింగ్...మింగ్... లింగం మింగిన బుల్లెయ్యా గుడిని మింగేదెపుడయ్యా? కోరస్: మింగ్... మింగ్... మింగ్...మింగ్... గుడిని లింగాన్ని గుటుకున మింగే మొనగాడే నీ మొగుడయ్యా అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో... ఓ... మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లెయ్యా అయ్యా బుల్లెయ్యా నీ అవతారలు ఎన్నయ్యో... క... క... క... క... కల్లయ్యా కోరస్: బు... బు... బు... బు... బుల్లెయ్యా కల్లయ్యా... బుల్లెయ్యా కల్లయ్యా... బుల్లెయ్యా కల్లబొల్లి... బుల్లెయ్యా ... ళూళూ... ఇయ్య...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dasara Bullodu

See All