MovieGQ

Chilaka Gorinka Kulike Paka Paka

Chenchu Lakshmi (1958) · Track 2 of 34

Song Details

Lyrics

చిలకా గోరింకా కులికే పకా పకా నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక చిలకా గోరింకా కులికే పకా పకా నీవే చిలకైతే నేనే గోరింకా రావా నా వంక చరణం: 1 చెలియా నేటికి చెలిమి ఫలించెనే కలలు కన్నట్టి కలిమి లభించెనే మనువూ నిజమామే తనువులు ఒకటాయె మదిలో తలంపులే తీరే తీయగా మారే హాయిగా చిలకా గోరింకా కులికే పకా పకా నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక చరణం: 2 కలికీ నీవిలా ఎదుటా నిలాబడా పలుకే బంగారం ఒలికే వయ్యారమే కలికీ నీవిలా ఎదుటా నిలాబడా పలుకే బంగారం ఒలికే వయ్యారమే ఒకటే సరాగము ఒకటే పరాచికం కలసి విహారమే చేద్దాం హాయిగా నీవే నేనుగా చిలకా గోరింకా కులికే పకా పకా నీవే చిలకైతే నేనే గోరింకా రావా నా వంక చిలకా గోరింకా కులికే పకా పకా నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All