MovieGQ

Cheyi Cheyi Kalupudam

Chenchu Lakshmi (1958) · Track 17 of 34

Song Details

Lyrics

చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకుదాం చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకుదాం చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం చరణం: 1 ఓ... ఓ... ఓ... అల్లిబిల్లిలాడదాం అంగలేసి దూకుదాం గున్నమావి చెట్టునీడ గుంపు గూడదాం గుంపు గూడదాం ఓ... ఓ... ఓ... చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకుదాం చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం చరణం: 2 ఓ... ఓ... ఓ... దాగుడు మూతాటంట సాగిరండమ్మా - ఓ.. ఓ.. దాగుడు మూతాటంట సాగిరండమ్మా పిల్లివచ్చె ఎలుక హుత్ చూడండమ్మా! చూడండమ్మా! ... పైన పోయె చిలుకలూ - హోయ్ పైన పోయె చిలుకలూ పావురాయి జంటలూ మీకు మాకు దీటైన వాట పందలూ మనకు వాట పందాలూ ఓ... ఓ... ఓ... చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకుదాం చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం చరణం: 3 ఓ... ఓ... ఓ... చిక్కు చిక్కు చెమ్మచెక్క చేరరండమ్మా - ఓ.. ఓ.. చిక్కు చిక్కు చెమ్మచెక్క చేరరండమ్మా చారడేసి మొగ్గలంట ఏరండమ్మా... ఏరండమ్మా... వయ్యరి జాణలు... - హోయ్ వయ్యరి జాణలు... వగలాడి చానలు ఓడిపొతే మీకంత ఆరు గుంజిళ్ళూ - హాఁ.. - ఊఁ ఓడిపొతే మీకంత ఆరు గుంజిళ్ళూ చెయ్యి చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకుదాం చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All