MovieGQ

Chettulekka Galava O Narahari

Chenchu Lakshmi (1958) · Track 31 of 34

Song Details

Lyrics

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే చరణం: 1 ఉరకలేయగలవా ఓ నరహరి పరుగులెత్తగలవా ఉరకలేయగలవా ఓ నరహరి పరుగులెత్తగలవా ఊడ పట్టుకుని జారుడు బండకు ఊగి చేరగలవా ఓ నరహరి ఊగి చేరగలవా ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఊడపట్టుకుని జారుడు బండకు ఊగి చేరగలనే ఓ చెంచిత ఊగి చేరగలనే చరణం: 2 ఓ హొయ్ గురిని చూసుకొని కనులు మూసుకుని బాణమేయగలవా ఓ నరహరి బాణమేయగలవా గురిని చూసుకొని వెనుతిరిగి నాణ్యముగ బాణమేయగలనే ఓ చెంచిత బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను మించగలనే చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే చరణం: 3 ఓహో... తగువులేల ఎగతాళిగాదు నను తాళికట్టనీవా ఓ చెంచిత తాళి కట్టనీవా మనసు తెలుసుకుని మరులు చూపితే మనువునాడనిస్తా ఓ నరహరి మనువునాడనిస్తా ఓ నరహరి మాల తెచ్చివేస్తా చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chenchu Lakshmi

See All