Song Details
Lyrics
ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని మెళకువలో కలలుగనే అందమైన మనసులివి ఉరకలతో ఉరుములతో పరుగుతీయు వయసులివి పసిమదిలో కసి ముదిరి చేరువైన గెలుపులివి జగడములో ఎగసి పడే తీపి తీపి అలకలివి తాయం పలికే కొంటె రాగమై కాలం వడిలో జంట తాలమై వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని అలజడిలో అలసటలో సేద తీర్చు స్వర్గమిది కలత కూడా కలత పడే మంచితనపు మలుపులివి భువనములో ప్రతి మనిషి మరువలేని ఘటనులివి హృదయములో పదిలముగా నిలిచిపోవు గురుతులివి ఎగసే ఎదలో ఎన్ని ఆశలో ఉరికే మదిలో ఎన్ని ఊసులో చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని
Lyrics sourced from public databases. May contain errors.