MovieGQ

Godaralle Ponge

Vasantham (2003) · Track 4 of 9

Song Details

Lyrics

గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం చరణం: 1 గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో తీసిందమ్మా తియ్యతీయగా గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం చరణం: 2 గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vasantham

See All