MovieGQ

Yemaindo Yemo

Tholi Prema (1998) · Track 2 of 5

Song Details

Lyrics

ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ చరణం: 1 వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా హే ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేల ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన జత వలతో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా చరణం: 2 జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్‌లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholi Prema

See All