Song Details
Lyrics
గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకని నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 2 నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
Lyrics sourced from public databases. May contain errors.